మారుతున్న కాలానికి తగట్టుగా ఆతిథ్యరంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది . ఆ రంగానికి ఉన్న అభివృద్ధి అవకాశాలతో పోలిస్తే...వాటి అవసరాలు తీర్చగలిగే మౌలిక సౌకర్యాలు, మానవ వనరులు కొరత తీవ్రంగా ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయా విభాగాల్లో శిక్షణ పూర్తిచేసుకొని నైపుణ్యం పొందిన వారికి ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి. ఇతర కోర్సులతో పోలిస్తే, హోటల్ మేనేజ్‌మెంట్ చేసిన వాళ్లు ఖాళీగా ఉండటం చాలా అరుదుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యం లోనే ఇంటర్ మీడియట్ పూర్తైన తరువాత ఇంజనీరింగ్ ,మెడిసిన్, అగ్రికల్చర్, అంటూ పరుగులు తీసిన విద్యార్థులు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. హోటల్ మేనేజ్ మెంట్ కోర్సుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వివిధ విభాగాల్లో అవకాశాలు కల్పిస్తోన్న తిరుపతి హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రాంగణం చెబుతున్నదీ అదే. ఇందులో ప్రవేశం కోసం దేశ నలుమూల నుంచి విద్యార్థు లు వస్తున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్ రంగం అవసరాలకు అనుగుణంగా తిరుపతి SIHM లో శిక్షణ సాగుతోంది. #IdiSangathi
0 Comments